గౌరవవేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:05 AM
గౌరవ వేతనం చెల్లించాలని ఎంపీటీసీలు కోరారు. సోమవారం ఎంపీపీ ఉప్పరపల్లి నీలవేణి అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం జరిగింది.
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 4 ( ఆంధ్రజ్యోతి): గౌరవ వేతనం చెల్లించాలని ఎంపీటీసీలు కోరారు. సోమవారం ఎంపీపీ ఉప్పరపల్లి నీలవేణి అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం జరిగింది. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతున్న సమయంలో పదవీకాలం ముగుస్తున్నా రెండేళ్లు గౌరవవేతనం అందకపోవడంపై ఎంపీపీ నీలవేణి నిరసన తెలియజేశారు. మిగిలిన ఎంపీటీసీ సభ్యులు వేదిక ముందు నేలపై బైఠాయించారు. దీంతో ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు జోక్యం చేసుకొన్నారు. 40 నెలలకు సంబందించి రూ.20 లక్షల గౌరవవేతనం బకాయి ఉండడంపై ఉన్నతాధికారులను నివేదించామని, బడ్జెట్ విడుదలైన వెంటనే పెం డింగ్ గౌరవ వేతనం అందజేస్తామని తెలియజేయడంతో సభ్యులు నిరసన కార్య క్రమాన్ని విరమించుకొన్నారు. సర్పంచ్‌ల గౌరవవేతనం పంచాయతీల నుంచి తీసుకోవచ్చని ఎంపీడీవో పేర్కొన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చ జరిగిం ది. మండలానికి సంబందించి 16 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉండ డంతో నోటిపికేషన్ విడుదలైన తర్వాత వాటిని భర్తీచేస్తామని ఐసీడీఎస్ పీవో పార్వతి పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ సీతారామయ్య, ఈవోపీఆర్డీ తిరుమలరావు, వైస్ ఎంపీపీ టి.శ్రావణి, వైద్యాధికారి భూన్ పాల్గొన్నారు.