విద్యార్థులపై తేనెటీగల దాడి
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:11 AM
పాఠశాలకు వెళుతున్న విద్యార్థులపై తేనెటీగల దాడికి గురైన ఘటన లావేరు మండలంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు గాయపడగా, వీరిలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
14 మందికి గాయాలు
పాఠశాలకు వెళుతుండగా లావేరు మండలంలో ఘటన
రణస్థలం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళుతున్న విద్యార్థులపై తేనెటీగల దాడికి గురైన ఘటన లావేరు మండలంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు గాయపడగా, వీరిలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. గుమడాంనుంచి తామాడ ఆదర్శ పాఠశాలకు వెళ్లేందుకు ఆటోలో 17 మంది విద్యార్థినీ విద్యార్థులు బయలుదేరారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణపురం వద్దకు వచ్చేసరికి కొన్ని చెట్లు ఈదురుగాలులకు నేలకొ రిగాయి. విద్యార్థులతో ఆటో చెట్టుకొమ్మలపై నుంచి వెళుతుండగా చెట్లకు ఉన్న తేనెపట్టులో ఈగలు చెలరేగి విద్యార్థులపై దాడిచేశాయి. దీంతో ఆటోలో ఉన్న వి. హిమజ, కె.సింధు, సీహెచ్ ఝాన్సీ, జి.మాధురి, వి.అనిల్‌కుమార్, కె.కోమలి, ఎన్.రాజేశ్వరి, పి.నవ్య, ఎం.భవాని, ఎ.సంధ్య, ఎ.రేవతి, ఎన్.పవన్‌కుమార్ హాహా కారాలు చేశారు. వెంటనే స్థానికులు స్పందిం చి వారిని మండల కేంద్రం లోని ఆస్పత్రితో పాటు రావాడ పీహెచ్‌సీలో చేర్పిం చారు. వీరిలో ఇద్దరి విద్యా ర్థినుల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
ఎమ్మెల్యే పరామర్శ
విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థుల ను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించా లని వైద్యాధికారులను ఆదేశించారు. కాగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు రణస్థలం మోడల్ స్కూల్‌లో భోజన వసతి కల్పించారు.