Share News

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:41 PM

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్న మహి ళకు సదరు ఆభరణాన్ని అందించి సిబ్బంది నిజాయితీని నిరూపించుకున్నారు.

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది
బంగారు ఆభరణాన్ని అందజేస్తున్న సిబ్బంది

అరసవల్లి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్న మహిళకు సదరు ఆభరణాన్ని అందించి సిబ్బంది నిజాయితీని నిరూపించుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం మధ్యాహ్నం డాక్టర్‌ మాధవీ జోషితాశ్రీ విశాఖ పట్నం వెళ్లేందుకు నాన్‌స్టాప్‌ కౌంటర్‌లో టిక్కెట్‌ తీసుకుని బస్సు ఎక్కి వెళ్లిపోయారు. అయితే టిక్కెట్‌ తీసుకుంటున్న సమయంలో తులం బరువు ఉన్న బంగారు కంకణం జారి కిందపడిపోయింది. బస్సులో విశాఖ పట్నం వెళుతూ మార్గమధ్యంలో బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్న విషయాన్ని గమ నించి తిరిగి శ్రీకాకుళం బస్‌స్టేషన్‌కు చేరుకు న్నారు. పోగొట్టుకున్న ఆభరణం ఆర్టీసీ సెక్యూ రిటీ కానిస్టేబుల్‌ జోగారావు, బస్‌స్టేషన్‌ మేనేజర్‌ మీసాల ప్రసాదరావు కంటబడడంతో వారు ఆ వస్తువును భద్రపరిచారు. ఈ విషయం ఎంక్వైరీ కౌంటర్‌ ద్వారా తెలుసుకున్న సదరు ప్రయాణి కురాలు స్టేషన్‌ మేనేజర్‌ను సంప్రదిం చారు. డిపో మేనేజర్‌ అమరసింహుడు సమక్షంలో ఆ మహిళ వివరాలను సేకరించి ఆభరణాన్ని అందించారు. దీంతో ఆమె ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు.

Updated Date - Feb 08 , 2026 | 11:41 PM