నేడు ఇచ్ఛాపురంలో హోంమంత్రి పర్యటన
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:46 PM
The end of the ‘Abhyudaya Cycle Tour’ హోంమంత్రి అనిత శనివారం ఇచ్ఛాపురంలో పర్యటించనున్నారు. మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ.. పాయకరావుపేట నుంచి ప్రారంభించిన ‘అభ్యుదయ సైకిల్‌యాత్ర’ శనివారం ఇచ్ఛాపురంలో ముగియనుంది.
‘అభ్యుదయ సైకిల్‌యాత్ర’ ముగింపునకు ఏర్పాట్లు
ఇచ్ఛాపురం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): హోంమంత్రి అనిత శనివారం ఇచ్ఛాపురంలో పర్యటించనున్నారు. మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ.. పాయకరావుపేట నుంచి ప్రారంభించిన ‘అభ్యుదయ సైకిల్‌యాత్ర’ శనివారం ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొనున్నారని సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. ‘ఇచ్ఛాపురంలో పోలీసుస్టేషన్ వద్ద శనివారం మధ్యాహ్నం 1 గంటకు పైలాన్‌ను హోంమంత్రి అనిత ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి దాసన్నపేట వరకు సైకిల్‌యాత్రలో పాల్గొంటారు. అనంతరం సురంగి రాజామైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని డ్రగ్స్, గంజాయి తదితర మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తారు’ అని సీఐ తెలిపారు. ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
పైలాన్ పనులు పరిశీలన..
అభ్యుదయ సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ఇచ్ఛాపురంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్ పనులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం పరిశీలించారు. హోంమంత్రి అనిత పర్యటన ఏర్పాట్లపై పోలీసు అధికారులు, సిబ్బందితో చర్చించారు.