Share News

హమ్మయ్యా!

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:42 AM

గజపతినగరం నియోజకవర్గం పరిధిలో చాలాచోట్ల రైల్వే గేట్ల వద్ద గంటల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి.

హమ్మయ్యా!

గజపతినగరం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): గజపతినగరం నియోజకవర్గం పరిధి లో చాలాచోట్ల రైల్వే గేట్ల వద్ద గంటల పాటు వాహనాలు నిలిచిపోతు న్నాయి. ప్రస్తుతం మూడోలేన్‌ పనులు జరుగుతుండడంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. రైలువస్తే అరగంటపాటు వాహనాలు గేటుకు ఇరువైపులా నిలిచిపోతున్నా యి. అత్యవసర సమయాల్లో 108 వాహనం కూడా ఆగిపోవాల్సిందే. గతంలో స్థానిక మెంటాడ రైల్వేగేటు వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జికి టీడీపీ హయాంలో ప్రణాళికలను రూపొం దించి నిధులు మంజూరు చేయాలని స్థానిక నాయకులు కోరారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభు త్వం దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం మూడోలైన్‌ రైల్వేపనులు జరుగుతుండడంతో గేట్లు ఉన్నచోట వంతె నల ఏర్పాటకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి మండ లాల్లో రైల్వేగేట్ల వద్ద ఆర్‌వోవీల నిర్మాణాలు చేపడుతు న్నారు. స్థానిక మెంటాడ రైల్వేగేటు మీదుగా గజపతినగ రం, మెంటాడ మండలాలకు చెందిన 50 గ్రామాల వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. దత్తిరాజేరు మండలం కోమటిపల్లి రైల్వేగేటు నుంచి దత్తిరాజేరు, మెంటాడ, మెరకముడిదాం, రాజాం మండలాలకు వెళ్లే వాహనదారులు ప్రయాణాలు సాగిస్తుంటారు. బొండ పల్లి మండలం కనిమెరక రైల్వేగేటు నుంచి గజపతినగ రం, బొండపల్లి, గంట్యాడ మండలాల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇందుకు సంబంధించి గజప తినగరం రైల్వేగేటు వద్ద వంతెన నిర్మాణానికి రూ.46.86 కోట్లు, బొండపల్లి మండలం కనిమెరక రైల్వే గేటువద్ద వంతెనకు రూ.48.68 కోట్లు, దత్తిరాజేరు మండలం కోమ టిపల్లి గేటు వద్ద రూ.49.36 కోట్ల వ్యయంతో వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు సంబంధిత అధికా రులు తెలిపారు. గతఏడాది సెప్టెంబర్‌ నెలలో రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు, ఆర్‌ ఆండ్‌బీ అధికారులు ఇటీవల స్థల పరిశీలన చేపట్టారు. ఇప్పుడు నిధులు మంజూరు కావడంతో సర్వే వేగవంతం చేస్తున్నారు. సర్వే అనంతరం నివేదిక రైల్వేశాఖకు నివేదిక అందజేయనున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. ఆతర్వాత రైల్వేశాఖ పనులు చేపడుతుంది. వంతెనల నిర్మాణాల వల్ల ఏన్నోఏళ్లగా ట్రాఫిక్‌ సమస్యతో సతమతమవుతున్న ప్రయాణికులు, వాహనదారుల ఇక్కట్లు తీరే అవకాశం ఉంది.

సర్వే చేపడుతున్నాం..

గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో గల రైల్వేగేట్ల వద్ద రైల్వే రైల్వేశాఖ వంతెనలను నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించి నిధులు మంజూరు అయ్యాయి. ఆర్‌ఆండ్‌బీ, రెవిన్యూ అధికారులు సర్వే చేపట్టి నివేదికలను రైల్వేశాఖకు అందజేస్తారు. ప్రస్తుతం సర్వేపనులు సాగుతున్నాయి.

-ఆర్‌ఆండ్‌బీ ఏఈ అజయ్‌బార్గవ్‌

Updated Date - Jan 17 , 2026 | 12:43 AM