భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని..
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:56 PM
భార్య పుట్టింటికి వెళ్లి రెండురోజులైనా తిరిగి రాలేదని సారా తాగిన ఓ వ్యక్తి బ్లేడ్‌తో చేయికోసుకొని వీరంగం సృష్టించిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని ఇందిరాచౌక్ వద్ద చోటుచేసుకుంది.
పలాస, జనవరి 27(ఆంధ్రజ్యోతి):భార్య పుట్టింటికి వెళ్లి రెండురోజులైనా తిరిగి రాలేదని సారా తాగిన ఓ వ్యక్తి బ్లేడ్‌తో చేయికోసుకొని వీరంగం సృష్టించిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని ఇందిరాచౌక్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రాజమ్మకాలనీకి చెం దిన నర్సిపురం తిరుపతి అనే వ్యక్తి భార్య పుట్టింటికి రెండురోజుల కిందట వెళ్లిపోయింది. కబురు పంపినా, ఫోన్‌చేసినా రాలేదన్న మన స్థాపంతో సారా తాగి రోడ్డుపై వీరంగం సృష్టిం చాడు. బ్లేడ్‌తో తన చేతిని కోసుకొని తీవ్ర రక్త స్రావాన్ని పాదచారులకు చూపిస్తూ హల్‌చల్ చేశాడు. దీంతోస్థానికులు ఆయన్ను అతికష్టం మీద సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం మళ్లీ రోడ్డుపై బైౖఠాయించి నిరసన తెలిపాడు. విష యం తెలుసుకున్న ఎస్‌ఐ నర్సింహమూర్తి, పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై కోపంతో మనస్థాపం చెంది సారా తాగి వీరంగం సృష్టించి నట్లు గుర్తించారు. అనంతరం సారా తాగిన స్థలానికి తరలించి దర్యాప్తు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.