జాతీయ స్థాయి పోటీలకు హిరమండలం కేజీబీవీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:04 AM
జాతీయ స్థాయిలో జరిగే ఏవమ్ హరిత విద్యాలయ పోటీలకు హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎంపికైనట్టు రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం నుంచి సమాచారం అందింది.
హిరమండలం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో జరిగే ఏవమ్ హరిత విద్యాలయ పోటీలకు హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎంపికైనట్టు రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం నుంచి సమాచారం అందింది. జిల్లా నుంచి రెండు ప్రభుత్వ పాఠశాలలు ఈ పోటీలకు ఎంపికయ్యాయి. వీటిలో హిరమండలం కేజీవీబీ పాఠశాల ఒకటి. మరొకటి జలుమూరు ఎంపీపీఎస్ పాఠశాల. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలలో బహుమతులు సాధించడం ద్వారా ఇది జాతీయ స్థాయికి ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ విద్యాలయ్ పురస్కార్ (కొత్తపేరు స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్) పోటీలకు ఈ పాఠ శాలలను ఎంపిక చేశారు. పాఠశాలల్లో ఆహ్లాదకరమైన, ఆరోగ్యకర మైన వాతావరణాన్ని పెంపొదించే లక్ష్యంతో ఈ పురస్కారాలు ఇస్తు న్నారు. స్వచ్ఛత, పచ్చదనం, మరుగుదొడ్లు నిర్వహణ, చేతుల శుభ్రత, విద్యార్థుల నడవడిక తదితర అంశాలను ఆధారంగా చేసుకుని ఈ పురస్కారం అందజేస్తారు.
జాతీయ స్థాయిలో ఎంపికైన పాఠశాలకు రూ.లక్ష నగదు ప్రోత్సా హకం అందజేస్తారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు దేశంలోని ప్రము ఖ ప్రదేశాలను సందర్శించేందుకు మూడు రోజుల పర్యటనకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన పాఠశాలలకు రిపబ్లిక్‌డే రోజున విజయవాడలో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ అవార్డు ను ప్రదానం చేస్తారు. హరిత విద్యాలయం ఎంపికకు కృషి చేసిన కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణ వేణిని ఎంఈవో కె.రాంబాబు తదితరులు అభినందించారు.