Share News

రైలు పట్టాలపై తెగిపడిన హైటెన్షన్‌ వైర్లు

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:45 PM

పొందూరు రైల్వేస్టేషన్‌లో విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు మరోసారి మంగళ వారం రైల్వే ట్రాక్‌పై తెగిపడ్డాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు.

రైలు పట్టాలపై తెగిపడిన హైటెన్షన్‌ వైర్లు
ట్రాక్‌పై తెగినపడిన విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు

15 రోజుల్లో రెండోసారి

లైదాం రైల్వేగేటు మధ్యలో నిలిచిన గూడ్సు

ఇబ్బందులు పడిన వాహనదారులు

సాయంత్రం ఆరు తరువాత లైన్‌ క్లియర్‌

పొందూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): పొందూరు రైల్వేస్టేషన్‌లో విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు మరోసారి మంగళ వారం రైల్వే ట్రాక్‌పై తెగిపడ్డాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఈనెల ఒకటిన హై టెన్షన్‌ వైర్లు తెగిపడినప్పటికీ ఆ సమయంలో ఆ ట్రాక్‌పై ఏ రైళ్లు రాకపోకలు సాగించకపోవడం, ట్రాక్‌ పక్క ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 15 రోజుల వ్యవధిలో రెండోసారి ఇలాంటి పరి స్థితి ఏర్ప డడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే సాంకేతిక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మంగళవారం మరోసారి హైటెన్షన్‌ వైర్లు తెగిపడ్డాయని పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు.

గేటు మధ్యలో నిలిచిన గూడ్సురైలు

రైల్వేస్టేషన్‌ సమీపంలో లైదాం రైల్వేగేటు మధ్యలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గూడ్సు నిలిచి పోయింది. దీంతో పొందూరు, సంతకవిటి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే గేటుకు ఇరు వైపులా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో చుట్టూ తిరిగి పెనుబర్తి అండర్‌ పాసేజీ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించారు. హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయని విశాఖలోని ఉన్నతాధికారులకు స్థానిక స్టేషన్‌ సూపరిం టెండెంట్‌ ప్రసాదరావు సమాచారం ఇవ్వడంతో టవర్‌ వ్యాగన్‌, ఓహెచ్‌ఈ కార్‌తో పొందూరు చేరుకున్న సాంకే తిక సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. దీంతో సాయం త్రం ఆరు గంటల తరువాత రైళ్లు యఽథావిధిగా నడిచా యి. అయితే ఈ సమయంలో రైళ్ల రాకపోకలను వేరే ట్రాక్‌ గుండా మరలించినట్లు స్టేషన్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.

Updated Date - Jul 14 , 2026 | 11:45 PM