Share News

పొటాష్‌ వినియోగంతో అధిక దిగుబడి

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:55 PM

వరి సాగులో పొటాష్‌ వినియోగం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆత్మ పీడీ కె.జగన్మోహనరావు తెలిపారు. శుక్రవారం మం డలంలోని దిమ్మిడిజోలలో పూర్వ అభ్యాసన గుర్తింపుపై రైతులకు శిక్షణ తరగతులు నిర్వ హించారు.

పొటాష్‌ వినియోగంతో అధిక దిగుబడి
మాట్లాడుతున్న జగన్మోహనరావు:

నందిగాం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వరి సాగులో పొటాష్‌ వినియోగం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆత్మ పీడీ కె.జగన్మోహనరావు తెలిపారు. శుక్రవారం మం డలంలోని దిమ్మిడిజోలలో పూర్వ అభ్యాసన గుర్తింపుపై రైతులకు శిక్షణ తరగతులు నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొటాష్‌ వినియోగంతో అధిక దిగుబడులు, నాణ్యత, గింజ బరువు, చీడపీడలు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. కలు పు, ఎరువుల యాజమాన్య పద్దతులపై అవగా హన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పి.శ్రీకాంత్‌వర్మ, టీడీపీ నాయకులు సలాన కృష్ణారావు, పాపినాయుడు, వీఏఏ ధరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 11:55 PM