మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:59 PM
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మేజర్ పంచాయతీ టెక్కలిలోని మండాపొలం కాలనీలో రూ.3.10 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులు, మురుగునీటి కాలువలను మంగళవారం రాత్రి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా, మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నయా అని అడిగి తెలుసుకున్నారు. గతంలో సరైన రహదారులు లేక ఇబ్బందులు పడేవారమని, ప్రస్తుతం సీసీ రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఉపశమనం కలిగిందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్, పోలాకి షణ్ముఖరావు, లవకుమార్, కామేసు, మామిడి రాము, దోని బుజ్జి, ప్రసాద్‌రెడ్డి, లాడి శ్రీనివాసరావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.