శ్రీకూర్మనాథుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:46 PM
ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మ నాథుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఆలపాటి గిరి ధర్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధి కారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గార, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మ నాథుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఆలపాటి గిరి ధర్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధి కారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారి గోత్ర నామాలతో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చరిత్రను అర్చ కుడు కిషోర్‌బాబు వివరించారు. న్యాయమూర్తి దంపతులకు అర్చకులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం అందించారు. కార్యక్రమంలో ప్రిన్సి పల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి కె.అనురాగ్, ఎస్‌ఐ సీహెచ్ గంగ రాజు, తహసీల్దార్ ఎం.చక్రవర్తి, సెంట్రల్ నాజర్ బి.నాగభూషణం, ప్రొటోకాల్ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
జలుమూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వరస్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఆలపాటి గిరిధర్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. దేవదాయశాఖ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయ ఈవో ఏడుకొండలు, తహసీల్దార్ జె.రామారావు, ఎస్‌ఐ బి.అశోక్‌బాబు, అర్చకులు పాల్గొన్నారు.