Share News

‘సేవాభావానికి ఆద్యుడు హెన్రీ డ్యూనాంట్‌’

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:25 AM

మానవత విలువలు, సేవాభావాన్ని పెంపొందిం చడంలో ఆద్యుడు జీన్‌హెన్రీ డ్యూనాంట్‌ అని రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు అన్నారు.

‘సేవాభావానికి ఆద్యుడు హెన్రీ డ్యూనాంట్‌’
డ్యూనాంట్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న జగన్మోహనరావు

శ్రీకాకుళం కల్చరల్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మానవత విలువలు, సేవాభావాన్ని పెంపొందిం చడంలో ఆద్యుడు జీన్‌హెన్రీ డ్యూనాంట్‌ అని రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు అన్నారు. రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌బ్యాంకు ఆవరణలో శుక్రవారం డ్యూనాంట్‌ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్‌ వ్యవస్థాప కుడైన జీన్‌హెన్రీ డ్యూనాంట్‌ ప్రపంచ వ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ ను విస్తరించి సేవలను సమాజానికి అందించేందుకు బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో ఎంసీ సభ్యుడు పి.శ్రీకాంత్‌, పరిపాలనాధికారి ఎ.నరసింగరావు, మేనేజర్‌ సతీష్‌, సత్యనారాయణ, పలువురు వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:25 AM