సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ క్రీడా పోటీల్లో హేమశ్రీ ప్రతిభ
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:12 AM
తమిళనాడు రాష్ట్రం సేలంలో ఇటీవల జరిగిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడాపోటీల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరుపున పాల్గొ న్న హేమశ్రీ ప్రతిభ కనబరిచింది.
వెయిట్ లిప్టింగ్‌లో రజత పతకం
ఎచ్చెర్ల/రూరల్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం సేలంలో ఇటీవల జరిగిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడాపోటీల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరుపున పాల్గొ న్న హేమశ్రీ ప్రతిభ కనబరిచింది. వెయిట్‌లిఫ్టింగ్ 63 కిలోల విభాగం పోటీలో హేమశ్రీ సత్తాచాటి రజత పతకం సాధించింది. హేమశ్రీ ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ కళాశాలలో బీఎడ్ చదువు తోంది. సౌత్‌జోన్ స్థాయిలో పతకం సాధించిన ఈమెను సోమవారం వర్సిటీ లో వీసీ, ప్రొఫెసర్ కేఆర్ రజని, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, స్పోర్ట్సు డీన్ భాస్కర్ అభినందించారు. భవిష్యత్‌లో జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని వీసీ ఆకాంక్షించారు.