హెల్మెట్‌తో ప్రాణాలకు రక్షణ
ABN , Publish Date - May 06 , 2026 | 12:14 AM
‘అమ్మ మనకు జన్మనిస్తుంది..హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కల్పించి.. పునర్జన్మ నిస్తుంద’ని కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని అన్నారు.
కాశీబుగ్గ డీఎస్పీ భవాని
కాశీబుగ్గ, మే 5(ఆంధ్రజ్యోతి): ‘అమ్మ మనకు జన్మనిస్తుంది..హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కల్పించి.. పునర్జన్మ నిస్తుంద’ని కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని అన్నారు. మంగళవారం స్థానిక మూడు రోడ్ల జంక్షన్ వద్ద ‘అభయం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్మెట్‌ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈమేరకు కాశీబుగ్గ నుంచి మొగిలిపాడు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నారని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ బ్యాంక్ ఏర్పాటు చేశామని... ...హెల్మెట్ లేనివారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేయకుండా తమ తరఫున అందజేస్తామని ఆమె తెలిపారు. వాహనదారులు కొత్తది కొనుగోలు చేసుకొని... తాము ఇచ్చిన హెల్మెట్‌ను 48 గంటల్లో సంబం ధిత పోలీసు స్టేషన్లలో అందజేయాలని డీఎస్పీ భవాని సూచించారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, రూరల్ సీఐ తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.