Share News

హెల్మెట్‌తో ప్రాణాలకు రక్షణ

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:11 AM

ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్‌ ధరించడంతో ప్రాణాలకు రక్షణ లభిస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శనివారం హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో హెల్మెట్‌ బ్యాం కును ప్రారంభించి ఆర్టీసీబస్టాండ్‌ వరకు హెల్మెట్‌ ధరించి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, ఎస్‌ఐ మధుసూధనరావు పాల్గొన్నారు.

 హెల్మెట్‌తో ప్రాణాలకు రక్షణ
పాతపట్నం: హెల్మెట్‌ వినియోగంపై ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు :

హిరమండలం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్‌ ధరించడంతో ప్రాణాలకు రక్షణ లభిస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శనివారం హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో హెల్మెట్‌ బ్యాం కును ప్రారంభించి ఆర్టీసీబస్టాండ్‌ వరకు హెల్మెట్‌ ధరించి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, ఎస్‌ఐ మధుసూధనరావు పాల్గొన్నారు.

ఫ పాతపట్నం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద గల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో హెల్మెట్‌ బ్యాంక్‌ వద్ద హెల్మెట్‌ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా 300 హెల్మెట్లను టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు చేతులమీదుగా పోలీస్‌ శాఖకు బహూకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సీఐ చింతాడ ప్రసాదరావు, ఎస్‌ఐ కె.మధుసూదనరావు పాల్గొన్నారు.

ఫమెళియాపుట్టి,(కొత్తూరు) ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కొత్తూరు పోలీసుల ఆధ్వ ర్యంలో హెల్మెట్‌ బ్యాంకును ఎమ్మెల్యే ఎంజీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐ వెంకటేష్‌, మాధవరావు, తులసీబాబు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:11 AM