హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:34 PM
ద్విచక్రవాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు కోరారు. మంగళవారం పాతపట్నం ఆర్టీసీకాంప్లెక్స్ సమీపంలో గల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద హెల్మె ట్ బ్యాంక్‌ను ప్రారంభించారు.
పాతపట్నం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు కోరారు. మంగళవారం పాతపట్నం ఆర్టీసీకాంప్లెక్స్ సమీపంలో గల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద హెల్మె ట్ బ్యాంక్‌ను ప్రారంభించారు. కోర్టుకూడలి నుంచి హెల్మెట్‌బ్యాంక్ వరకూ హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐలు కె.మధుసూదనరావు, మహమ్మద్ ఆలీ పాల్గొన్నారు.