ఎన్నాళ్లీ నరకం
ABN , Publish Date - May 04 , 2026 | 12:12 AM
టెక్కలి-తొలుసూరుపల్లి రోడ్డు పనులు నత్తన డకన సాగుతున్నాయి.
-నత్తనడకన టెక్కలి-తొలుసూరుపల్లి రోడ్డు పనులు
- వర్షాలకు బురదమయం.. ప్రజలకు తప్పని పాట్లు
టెక్కలి, మే 3 (ఆంధ్రజ్యోతి): టెక్కలి-తొలుసూరుపల్లి రోడ్డు పనులు నత్తన డకన సాగుతున్నాయి. నెలల తరబడి సీసీ రోడ్డు పనులు జరుగుతుండ డంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత మూడురోజులుగా కురుస్తున్న అకా ల వర్షాలతో ఎన్టీఆర్ కాలనీ నుంచి శ్రీనివాస్‌నగర్ వరకు రోడ్డుపై వరద నిలి చిపోయి బురదమయం అయ్యింది. దీంతో పాదచారులతో పాటు వాహనదా రులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి సీసీ రోడ్డు పనులు జరుగుతుండడం తమ పాలిట శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.