Share News

ఉత్సవ ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన హెలికాప్టర్‌ రైడ్‌

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:12 AM

అరసవల్లి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌ రైడింగ్‌ మరింత వన్నె తెచ్చిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

ఉత్సవ ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన హెలికాప్టర్‌ రైడ్‌
చాపర్‌ రైడ్‌ సిబ్బందితో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌ రైడింగ్‌ మరింత వన్నె తెచ్చిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం హెలికాప్టర్‌ రైడింగ్‌ జరుగుతున్న తీరును ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఏడు రోజుల పాటు శ్రీకాకుళం పరిసర ప్రాంత వాసులను ఈ హెలిటూరిజం కొత్త అనుభూతులను మిగిల్చిందన్నారు విరామం లేకుండా వినోదాన్ని అందించిన పైలెట్లను అభినందించారు. హెలిటూరిజం పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:12 AM