Share News

భానుడు భగభగ

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:04 AM

Extreme heatwaves in 19 mandals today! జిల్లా వాసులను భానుడు భయపెడుతున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ మంగళవారం విడుదల చేసిన ముందస్తు వాతావరణ నివేదిక జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

భానుడు భగభగ

జిల్లాలో నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు!

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా వాసులను భానుడు భయపెడుతున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ మంగళవారం విడుదల చేసిన ముందస్తు వాతావరణ నివేదిక జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ నివేదిక ప్రకారం రానున్న 48 గంటల్లో జిల్లాలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకోనుంది. బుధ, గురువారాల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులు వీయనున్నాయి.

మంగళవారం జిల్లాలో కేవలం రెండు మండలాల్లో వడగాల్పులు వీయగా.. 28 మండలాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా తీవ్రమైన వడగాల్పులు నమోదు కాలేదు.

బుధవారం మాత్రం ఎండల తీవ్రత గరిష్టానికి చేరుకోనుంది. ఏకంగా 19 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 5 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని నివేదిక హెచ్చరించింది. కేవలం 6 మండలాలకు మాత్రమే ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది.

గురువారం నాలుగు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 11 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది.

నేడు నమోదు కానున్న అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీల సెంటీగ్రేడ్‌)

-------------------------------

కొత్తూరు 46.2

హిరమండలం 45.4

బూర్జ 45.1

పాతపట్నం 45.1

ఎల్‌.ఎన్‌.పేట 44.4

సారవకోట 44.3

శ్రీకాకుళం అర్బన్‌ 40.5

Updated Date - Apr 22 , 2026 | 12:04 AM