పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యాంధ్ర ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
ABN , Publish Date - May 14 , 2026 | 12:22 AM
ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు గ్రామ పరిశుభ్రతను బాధ్యతగా స్వీకరించాలని, తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యపడు తుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
రణస్థలం, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు గ్రామ పరిశుభ్రతను బాధ్యతగా స్వీకరించాలని, తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యపడు తుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని బుధవారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్య క్రమం నిర్వహించారు. రామతీర్థం రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను అధికా రులు, ప్రజా ప్రతినిధులు ఎత్తి స్వచ్ఛరథంలో వేశారు. నీటి నిలువ వల్ల దోమలు ఉత్పత్తి చెంది జ్వరాల బారిన పడే అవకాశం ఉందన్నారు. అందువల్ల పరిస రాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు డీజీఎం ఆనందరావు, పిషిని జగన్నాథంనాయుడు, బెండు మల్లేశ్వరరావు, పిన్నింటి భానోజినాయుడు, రౌతు శ్రీనివాస రావు, ఎంపీడీవో ఈశ్వరరావు, సూపరింటెం డెంట్ డి.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
‘స్వచ్ఛపదం’లో భాగస్వాములుకండి
ఎమ్మెల్యే గొండు శంకర్
గార, మే 13 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర లక్ష్యంగా చేపడుతున్న స్వచ్ఛపదం కార్యక్ర మంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం తూలుగు పంచాయతీలో ‘స్వచ భారతం’లో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరా లతో పాటు గ్రామాలు, పట్టణాలు పరిశు భ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరో గ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. అలాగే పచ్చదనం పెంపొందిం చేందుకు గాను మొక్కలు నాటి వాటిని సంరక్షించా లన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీని వా సులు, ఏవో రఘు, ఆర్ అండ్‌బీ ఏఈ సీహెచ్ గోవిందరావు, కూటమి నాయ కులు, సిబ్బంది పాల్గొన్నారు.