Share News

నడకతో ఆరోగ్యం

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:24 AM

నడకతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం సిద్ధిస్తుం దని, నడక దినచర్యలో ఒక భాగంగా చేసుకో వాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నా రు.

 నడకతో ఆరోగ్యం
జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): నడకతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం సిద్ధిస్తుం దని, నడక దినచర్యలో ఒక భాగంగా చేసుకో వాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నా రు. వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ 40వ వార్షి కోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల వద్ద 5-కె వాక్‌థాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న తనం నుంచే పిల్లలకు నడక వల్ల కలిగే ప్రయోజనాలను వివరిం చాలని, ఆరోగ్య సంరక్షణకు నడక ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. ఈనెల 26న జరుగనున్న ఎన్నికల పోలిం గ్‌కు పట్టణ వాసులందరూ తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్య క్రమంలో సమన్వయకర్త శాసపు జోగి నాయుడు, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఎన్‌. అప్పల స్వామి, వాకర్స్‌ సంస్థ ప్రతినిధులు పీజీ గుప్తా, ఆరిక తోట తిరుపతిరావు, గేదెల ఇందిరా ప్రసాద్‌, గుడ్ల సత్యనారాయణ, కూన వెంకట రమణమూర్తి, నటుకుల మోహన్‌, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:24 AM