పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:57 PM
పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శనివారం లావేరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్య క్రమం నిర్వహించారు.
ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
లావేరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శనివారం లావేరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక స్వచ్ఛ రథం, 33 ట్రైకిళ్లు, 12 పుష్‌కార్స్‌ను పంచాయతీ లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం గా అందరం భాగస్వాములు కావాలన్నారు. అనంతరం పిం ఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి. వెంకటరాజు, తహసీల్దార్ జీఎల్‌ఈ శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, పీఏసీఎస్ అఽధ్యక్షుడు కూనపల్లి దామోదరరావు, ఏఎంసీ చైర్మన్ నిడిగంట్ల పద్మ, నేతలు తోటయ్యదొర, ఆరెళ్ల కృష్ణ, పిన్నింటి మధు బాబు, లంక శ్యామలరావు పాల్గొన్నారు.
స్వచ్ఛాంధ్రలో భాగస్వామ్యం కావాలి: శంకర్
శ్రీకాకుళం రూరల్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 23 పంచాయతీలకు సంబంధించి 38 చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు. సదరు రిక్షాను ఎమ్మెల్యే తొక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఏపీఈ డబ్యూఐడీసీ డైరెక్టర్ పీఎంజే బాబు, వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర, ఎంపీడీవో వి.ప్రకాశరావు, డిప్యూటీ ఎంపీడీవో కె.సూర్య నారాయణ, నైర సర్పంచ్ అరవల రామ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.