సైకిల్ వినియోగంతో ఆరోగ్యం
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:57 PM
సైకిల్ విని యోగంతో ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ రెండూ సాధ్యమవు తాయని మేరా యువభారత్ జిల్లా అధికారి నిమ్మల కృష్ణ అన్నారు.
మేరా యువభారత్ జిల్లా అధికారి నిమ్మల కృష్ణ
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): సైకిల్ విని యోగంతో ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ రెండూ సాధ్యమవు తాయని మేరా యువభారత్ జిల్లా అధికారి నిమ్మల కృష్ణ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వ ర్యంలో బుధవారం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా అరస వల్లి సాయి ఐటీఐ నుంచి మిల్లు జంక్షన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు సైకిల్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. చిన్న, చిన్న దూరాలకు మోటార్ వాహనాలకు బదులుగా సైకిల్ వినియోగంతో ఎంతో ఉప యోగకరమని, ఇంధనంతో పాటు డబ్బు ఆదా అవుతుందన్నారు. యువజన సర్వీసుల శాఖ సీఈవో వీవీ అప్పల నాయుడు మాట్లాడుతూ.. రోజుకు ఒక గంట సైకిల్ తొక్కడం వల్ల300 కేలరీల వరకు శక్తి ఖర్చవుతుందని, ఇది బరువు తగ్గేందుకు, మానసిక ఒత్తిడిని అధిగమించేం దుకు దోహదపడుతుం దన్నారు. కార్యక్రమంలో గణాంకాధికారి డి.శ్రీనివాసరావు, ఐటీఐ ట్రైనర్ జి.తేజేశ్వరరావు, వలంటీర్లు అరుగుల దిలీప్ కుమార్, ప్రియాంక, మౌనిక, యువకులు పాల్గొన్నారు.