Share News

ఆరోగ్యమే నిజమైన సంపద

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:58 PM

ఆరోగ్యమే నిజమైన సంపద అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.కె.అనిత అన్నారు.

 ఆరోగ్యమే నిజమైన సంపద
ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో డా.అనిత తదితరులు

- డీఎంహెచ్‌వో డా.కె.అనిత

అరసవల్లి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యమే నిజమైన సంపద అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.కె.అనిత అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘విజ్ఞానానికి అండగా నిలుద్దాం...ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దాం’ అనే నినాదంతో మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరోగ్యంపై శ్రదఽ్ధ వహించాలని, ఆరోగ్యకర జీవన శైలిని అనుసరిస్తూ ఆనందకర జీవితాన్ని అనుభవించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమం లో డీఐవో డా.రాందాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.మేరీ క్యాథరిన్‌, డా.శివరంజని, కె.ఎర్రన్న, ఎస్‌.విజయలక్ష్మి, పి.మోహిని, రత్నకుమారి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, రెడ్‌క్రాస్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:58 PM