Share News

ఉపాధి కోసం వెళ్లి...

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:11 AM

రావులవలస గ్రామానికి చెందిన రెడ్డి కిరణ్‌కుమార్‌ (30) కర్నూలులో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు కుటంబ సభ్యులు, బంధువులు తెలిపారు.

ఉపాధి కోసం వెళ్లి...
కిరణ్‌కుమార్‌ (ఫైల్‌)

  • కర్నూలులో జిల్లా యువకుడి మృతి

  • రేకుల షెడ్డు కూలడంతో ప్రమాదం

నరసన్నపేట, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రావులవలస గ్రామానికి చెందిన రెడ్డి కిరణ్‌కుమార్‌ (30) కర్నూలులో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు కుటంబ సభ్యులు, బంధువులు తెలిపారు. కర్నూలు పట్టణంలో ఒక షెడ్‌ నిర్మాణంలో వెల్డర్‌గా కిరణ్‌కుమార్‌ పనిచేస్తున్నాడు. అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలలకు వేసిన రేకుల షెడ్డు పడిపోవడంతో వాటి కింద ఇరుక్కుపోయి గురువారం సాయంత్రం మృతిచెందినట్లు సమాచారం వచ్చిందని కుటంబ సభ్యులు తెలిపారు. కిరణ్‌ గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఒక కాంట్రాక్టరు వద్ద వెల్డర్‌గా పనిచేస్తున్నారు. కర్నూలులో పని నిమిత్తం ఇటీవల హైదరాబాద్‌ వెళ్లిన కిరణ్‌ ప్రమాదంలో మృతిచెందాడు. ఆయనకు ఇద్దరు అక్కలు ఉన్నారు. కుమారుడు మృతిచెందిన సమాచారం రావడంతో తల్లిదండ్రులు చిన్నారావు, గంగమ్మ గుండె పగిలేలా విలపిస్తున్నారు. ఆదివారం స్వగ్రామం రావులవలసలో కిరణ్‌కుమార్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:11 AM