బతుకుతెరువు కోసం వెళ్లి..
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:00 AM
తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో జింకిభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు(32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యాదాద్రిలో జింకిభద్ర వాసి ఆత్మహత్య
సోంపేట, ఆగష్టు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో జింకిభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు(32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అంబటి విశ్వనాథం, అప్పలనరసమ్మల మూడో కుమారుడు జానకిరావు బతుకుతెరువు కోసం ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఉంటుండగానే మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా పనులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. యాదాద్రి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జానకిరావు అన్నయ్య సోమేశ్వరరావు 15 ఏళ్ల కిందట సోంపేట-జింకిభద్ర మాధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇద్దరు కుమారులు మృతిచెందడంలో తల్లిదండ్రులు రోదిస్తున్నారు.