కోర్టు పని మీద ఊరికి వచ్చి...
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:20 AM
కోమర్తి గ్రామానికి చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) హెచ్‌సీ కింజరాపు రాజారావు (49) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమా మృతి చెందినట్లు ఎస్‌ఐ గణేష్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో హెచ్‌సీ మృతి
నరసన్నపేట, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): కోమర్తి గ్రామానికి చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) హెచ్‌సీ కింజరాపు రాజారావు (49) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమా మృతి చెందినట్లు ఎస్‌ఐ గణేష్ తెలిపారు. కడప జిల్లా పులివెందులలో ఎస్‌పీఎఫ్ హెచ్‌సీగా పనిచేస్తున్న రాజారావు కోర్టు పని మీద శనివారం ఉదయం స్వగ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో గ్రామంలోని తన సోదరుని ఇంటికి వెళ్లి.. అటు నుంచి విశాఖపట్నంలో ఉంటున్న తన ఇంటికి వెళ్లేందుకు స్కూటీ మీద బయలుదేరారు. కోమర్తి వద్ద జాతీయ రహదారిపై కి వెళ్లే సమయంలో శ్రీకాకుళం నుంచి టెక్కలి వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలోఓ హెచ్‌సీ రాజారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ గణేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు రోషిణి, అమృత ఉన్నారు. భార్య, పిల్లలు విశాఖపట్నంలో ఉంటున్నారు. రాజారావు మ ృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గణేష్ తెలిపారు.