Share News

హడావుడి పదోన్నతులా?

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:53 PM

సచివాలయ ఏఎన్‌ఎంల పదోన్నతు ల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని అత్యవసరంగా సమాచారం అంది స్తున్నారు.

  హడావుడి పదోన్నతులా?

సీనియారిటీ జాబితా లేకుండానే..

ఏఎన్‌ఎంల సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుపు

అరసవల్లి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఏఎన్‌ఎంల పదోన్నతు ల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని అత్యవసరంగా సమాచారం అంది స్తున్నారు. గతంలో పదోన్నతుల సమయంలో అర్థరాత్రి వరకు డీఎం హెచ్‌వో కార్యాలయం నుంచి ఫోన్లు, అభ్యర్థులతో చర్చలు జరిగి, మొత్తం మీద తీవ్ర అవినీతి ఆరోపణల మధ్య ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇందు లో ముఖ్యంగా రూరల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాల్సిన 9 పోస్టులు కేటాయించకపోవడంతో ఆ విషయాన్ని జాతీయ ఎస్టీ కమిష న్‌కు సంబంధిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో కమిషన్‌ విచారణ చేపట్టి పోస్టులను కేటాయించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మరలా ఈ 9 పోస్టులను పక్కన పెట్టి, మిగిలిన పోస్టు లకు గాను మంగళవారం తమ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు రావాలని జిల్లాలోని ఆయా ఆసుపత్రుల వైద్యులు సంబంధిత ఏఎన్‌ఎంలకు ఫోన్లు, వాట్సాప్‌ మేసేజ్‌ల ద్వారా సమాచారమిచ్చారు. అయితే గతంలోని సీనియారిటీ జాబితా మాయం కాగా ఇంతవరకు ఆ విషయం తేలలేదు. మరి సీని యారిటీ జాబితా లేకుండా పదోన్నతులకు వెరిఫికేషన్‌ ప్రక్రియ ఎలా నిర్వహిస్తారన్నది వారికే ఎరుక. ఈ హడావుడి పదోన్నతుల వెనుక గత ఆరోఫణల నుంచి తప్పించుకునేందుకు ఫోన్లు, వ్యక్తుల ద్వారా ఏఎన్‌ఎం లకు సమాచారం అందజేయడం, అందువల్లే అర్థరాత్రి వరకు ఈ పిలు పుల పర్వం మరలా కొనసాగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 9 మందికి ఎస్టీ కోటా కింద కేటాయించిన పోస్టులకు సంబం ధించి, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, దీనిపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు మౌనం వహించడం వెనుక కారణలేమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఏది ఏమైనా ఈ విషయమై మరింత లోతైన విచారణ చేపడితే, పదోన్నతుల విషయంలో జరిగిన అక్రమ వసూళ్లు, అవకతవకలు బయటపడతా యని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:53 PM