కష్టపడి పనిచేస్తే ఫలితం
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:14 AM
పార్టీ కోసం నిరంతరం పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని శాఖ పట్నం దక్షిణ ఎమ్మె ల్యే, జనసేన పార్లమెంటరీ నియోజకవర్గ సమాచార సేకరణ కమిటీ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే, జనసేన నేత వంశీకృష్ణ
శ్రీకాకుళం అర్బన్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం నిరంతరం పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని శాఖ పట్నం దక్షిణ ఎమ్మె ల్యే, జనసేన పార్లమెంటరీ నియోజకవర్గ సమాచార సేకరణ కమిటీ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో క్రియాశీలక పార్టీ, నామినేటెడ్ పదవుల కోసం సోమ వారం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో జనసేన పార్టీ జిల్లా అధ్య క్షుడు పిసిని చంద్రమోహన్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నాయ కులు కోరాడ సర్వేశ్వర రావు, గేదెల చైతన్య, పేరాడ రామ్మోహన్, దానేటి శ్రీధ ర్, కోత పూర్ణచంద్రరావు, కణితి కిరణ్, దాసరి రాజు పాల్గొన్నారు.