కృషి ఫలించింది
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:58 PM
నియోజక వర్గ సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి ఫలిస్తుంద ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
‘వంశధార‘కు నిధుల మంజూరుపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హర్షం
పాతపట్నం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గ సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి ఫలిస్తుంద ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. బీఆర్‌ఆర్ వంశధార రిజర్వాయర్ యాప్రాస్ నిర్మాణానికి రూ.16.49కోట్ల నిధులు ప్రభు త్వం మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబుకి, మంత్రి నిమ్మల రామానాయుడుకి ఈ సంద ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వాయర్ సమస్యలు ప్రస్తావించగా.. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. రిజర్వాయర్ వద్ద యాప్రాన్ నిర్మాణం చేపడితే శివారు భూములకు సాగునీరందుతుంద న్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం చూపుతు న్న చిత్తశుద్ధికి తనతోపాటు నియోజకవర్గప్రజలు సర్వదా కృతజ్ఞులై ఉంటామని తెలిపారు.