కాలిబూడిదైన కష్టం
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:35 PM
మండ లంలోని లోకొండ పంచా యతీ గొడియాపాడు గ్రామంలో గిరిజనులు సాగుచేస్తున్న చీపురు పంట మంగళవారం ఉద యం దగ్ధమైంది.
- గొడియాపాడులో 14 ఎకరాల్లో చీపురు పంట దగ్ధం
- రూ.లక్షల్లో నష్టం
- లబోదిబోమంటున్న గిరిజనులు
హిరమండలం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని లోకొండ పంచా యతీ గొడియాపాడు గ్రామంలో గిరిజనులు సాగుచేస్తున్న చీపురు పంట మంగళవారం ఉద యం దగ్ధమైంది. కొండ పోడు భూమిలో పండి స్తున్న సుమారు 14 ఎక రాల్లోని పంట పూర్తిగా కాలిబూడిదైంది. రూ.15 లక్షల వరకు నష్టం ఉం టుందని బాధిత రైతులు చెబుతున్నారు. సవర చిన్నకు చెందిన 2.7 ఎక రాలు, సవర గుడమకు చెందిన 3 ఎకరాలు, సవర చిన్నసోడంగా 3.4 ఎకరాలు, ఊయక సంధ్య 2.4 ఎకరాలు, ఆరిక గౌరమ్మకు చెందిన 2 ఎకరాల్లోని చీపురు పంట అగ్నిమంటలకు పూర్తిగా బూడిదైంది. సంవత్సరమంతా కష్టపడి పండించిన పంట కళ్లెదురుగానే బూడిదకావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.