ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:45 PM
104 ఉద్యోగులపై భవ్య యాజమాన్యం వేధింపులు ఆపాలని, షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ చర్యలను నిలుపుదల చేయా లని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
అరసవల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): 104 ఉద్యోగులపై భవ్య యాజమాన్యం వేధింపులు ఆపాలని, షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ చర్యలను నిలుపుదల చేయా లని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకు ళంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు తమ సమస్యలను పరిష్కరించాలని 104 ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ భవ్య యాజమా న్యం 104 ఉద్యోగులకు అన్యాయంచేస్తోందని విమర్శించారు.కార్యక్రమంలో ఎం.ఆది నారాయణ, జి.గిరిధర్, కె.గణపతి, సీఐటీయూ నాయకులు బి.మురళి, ప్రకాశరావు, 104 యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణరావు, కిరణ్ పాల్గొన్నారు.