అమ్మవార్లకు ఆషాడమాసం సారె
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:04 AM
ఊడికలపాడులో కొత్తమ్మతల్లి, దుర్గమ్మ తల్లి, చెవిటమ్మతల్లులకు గ్రామస్థులు ఆషాడ మాసం పురస్కరించుకొని పలు రకాల వంటకాలతో శుక్రవారం సారెను సమర్పించారు.
కోటబొమ్మాళి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఊడికలపాడులో కొత్తమ్మతల్లి, దుర్గమ్మ తల్లి, చెవిటమ్మతల్లులకు గ్రామస్థులు ఆషాడ మాసం పురస్కరించుకొని పలు రకాల వంటకాలతో శుక్రవారం సారెను సమర్పించారు. శ్రీరాముడు అవతారమైన శ్రీకృష్ణుడు ఆడపడుచులైన అమ్మవార్లకు రామమందిరం నుంచి గ్రామస్థులు తరలివెళ్లి స్వీట్లు, పండ్లు, చీరలు తీసుకువెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మహిళల ఆఽఽధ్వర్యంలో గ్రామోత్సవంచేసి మంగళవాయిద్యాల నడుమ నైవేద్యం సమర్పించారు. కార్యక్ర మంలో ప్రవచనకారుడు సనపల కరుణ్‌కుమార్, గ్రామస్థులు హనుమంతు వెంకటరావు, నేతింటి వెంకటరావు, మెండ తిరుపతిరావు పాల్గొన్నారు.