చేనేత కార్మికురాలు ఆత్మహత్య
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:06 AM
కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చేనేత కార్మికు రాలు అలాడ సత్యవతి(45) ఆదివారం ఆత్మహ త్యకు పాల్పడ్డారు.
పొందూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చేనేత కార్మికు రాలు అలాడ సత్యవతి(45) ఆదివారం ఆత్మహ త్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు చేనేత వాడ పరిధి లావేటివీధికి చెందిన సత్యవతి కొన్నాళ్లగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం ఉదయం ఎవరూలేని సమయంలో యాసిడ్ తాగి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. భర్త సోమేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ధర్మపురం గ్రామంలో వివాహిత..
ఇచ్ఛాపురం, జూలై 12(ఆంధ్రజ్యోతి): ధర్మపురం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పైలవీధికి చెందిన మరడ ధనలక్ష్మికి ఒడిశా రాష్ట్రంలోని తబొరడా గ్రామానికి చెందిన నందిక లోకనాథంతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన నాటినుంచి భర్త లోకనాథం అనుమానంతో ధనలక్ష్మిని వేధించేవాడని, ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా మార్పు రాలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొంటు న్నారు. ధనలక్ష్మి మృతికి భర్త లోకనాథం, వారి కుటుంబ సభ్యులే కారణమని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు.
శ్రీకాకుళం నగరానికి చెందిన మహిళ..
శ్రీకాకుళం క్రైం, జూలై 12(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆదివారంపేటకు చెందిన బోనెల షర్మిల శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. నాగరాజు కొన్ని నెలలుగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈయనకు పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామానికి చెందిన షర్మిలతో ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. అయితే వివాహం అయినప్పటి నుంచి భర్త నాగరాజుతో పాటు అత్తమామలు వేధిస్తుండేవారిని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపి స్తున్నా రు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కుంది. షర్మిల తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.