Share News

అవినీతి రుజువైతే బేడీలు

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:10 AM

వైసీపీ హయాంలో జరిగిన అనినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

అవినీతి రుజువైతే బేడీలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

గత పాలకుల అక్రమాలపై కఠిన చర్యలు

ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన అనినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడు తూ.. వారి అవినీతి రుజువైతే చేతులకే కాదు కాళ్లకు బేడీలు వేసి నడిపిస్తా మని స్పష్టంచేశారు. నగరం నడి బొడ్డున టౌన్‌హాల్‌ ఉన్న స్థలం మునిసిపాలిటీదని, గత పాలకులు సొసైటీ పేరుతో ఆక్రమించి పార్టీ కార్యాలయంగా మార్చారని విమర్శిం చారు. విచారణ చేపట్టి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షి స్తామన్నారు. లింగాలవసలో జగనన్న కాలనీల పేరుతో భూముల కొను గోలులో ప్రఽజాధనం దుర్వినియోగమైందన్నారు. సుమారు పన్నెండున్నరేళ్లు మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. గత పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగ విచారణకు రావాలని సవాల్‌ విసిరారు. కూటమి ప్రభుత్వ పాలనలో కనీస సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. నగరంలో తాగునీరు, ట్రాఫి క్‌ సమస్యల పరిష్కారం, కొత్త బ్రిడ్జి నిర్మాణం, రిమ్స్‌ అభి వృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. టైటానియం, హబ్‌, బీచ్‌ మినరల్‌ ఫ్యాకర్టీల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి కల్పిం చేందుకు భూసేకరణ చేస్తున్నామన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదల వలస రమేష్‌, పలువురు నేతలు పాల్గొన్నారు.

అడ్డంకులు అధిగమించి ఎన్నికలు: శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): విలీన పంచాయతీల్లో ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించి మునిసి పాలిటీ ఎన్నికలు నిర్వహించేలా ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. గురువారం విలీన పంచాయతీల పెద్దలు, నగర పాలక సంస్థ కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌తో కలిసి సమావేశం నిర్వ హించి చర్చించారు. యాక్ట్‌-5ను రద్దు చేసైనా ఎన్నికలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Sep 04 , 2026 | 12:10 AM