‘గుండ’ ఆశీస్సులు టీడీపీకే..
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:09 AM
దివం గత నేత, మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ ఆశీ స్సులు టీడీపీకే ఉంటాయని ఎమ్మె ల్యే గొండు శంకర్ అన్నారు. అరసవల్లి కూడలిలో ఏర్పాటు చేసి అప్పల సూర్య నారాయణ కాంస్య విగ్రహాన్ని గురు వారం ఆవిష్కరించి నివాళి అర్పించారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి జంక్షన్‌లో మాజీమంత్రి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణ
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): దివం గత నేత, మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ ఆశీ స్సులు టీడీపీకే ఉంటాయని ఎమ్మె ల్యే గొండు శంకర్ అన్నారు. అరసవల్లి కూడలిలో ఏర్పాటు చేసి అప్పల సూర్య నారాయణ కాంస్య విగ్రహాన్ని గురు వారం ఆవిష్కరించి నివాళి అర్పించారు. అప్పల సూర్యనారాయణ జిల్లాకు, పార్టీకి సుదీర్ఘ కాలంగా అందించిన సేవలు ఎనలేనివన్నారు. ఆయన ప్రథమ వర్ధంతి రోజున సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఘనంగా నివాళి అర్పిస్తామన్నారు. ఆయన తుదిశ్వాస విడిచిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు చలించి ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఓదార్చారన్నారు. కేంద్ర, రాష్ట్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నా యుడు, కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో అధికార లాంఛనాలతో అంత్యక్రి యలు నిర్వహించామన్నారు. విగ్రహ ఏర్పాటుపై ఎన్ని సందేహాలు సృష్టించినా, నిందారోపణలు చేసినా అరసవల్లి ఆదిత్యుడు, అప్పల సూర్య నారాయణ ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాండ్రంకి శంకర్, మూకళ్ల శ్రీనివాస్, లోపింటి రాధాకృష్ణ, సింతు సుధాకర్, పీఎంజే బాబు, పొట్నూరు కృష్ణమూర్తి, రమణ మాదిగ, ఉంగటి రమణ, రాయపల్లి అర్జున్ పాల్గొన్నారు. ఇది లా ఉండగా మునిసిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన కొద్దిసేపటికే అధికారులు ముసుగువేశారు.