Share News

నీతి, నిజాయితీలకు చిరునామా ‘గుండ’

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:01 AM

మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పలసూర్య నారాయణ నీతి, నిజాయితీలకు చిరునామా అని పలువురు వక్తలు అన్నారు.

నీతి, నిజాయితీలకు చిరునామా ‘గుండ’
గుండ అప్పలసూర్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కుమారులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు

అరసవల్లి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పలసూర్య నారాయణ నీతి, నిజాయితీలకు చిరునామా అని పలువురు వక్తలు అన్నారు. ఇటీవల మృతి చెందిన అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని అరసవల్లిలో గురువారం ఆయన తనయులు గుండ శివ గంగాధర్‌, గుండ విశ్వనాథ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడు తూ.. రాజకీయాల్లో విలువలే శ్వాసగా, అజాత శత్రువుగా పనిచేసిన గుండ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అరసవల్లికి గౌరవాన్ని, గుర్తింపును తీసుకువచ్చారని, ఆయన లేని లోటు తీరనిదన్నారు. ఈ సందర్భంగా అప్పల సూర్య నారాయణ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. కార్య క్రమంలో పలు వురు అరసవల్లి గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

‘గుండ’ కుటుంబానికి ధర్మాన పరామర్శ

మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కుటుం బాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం అరస వల్లిలో వారి గృహంలో పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, తనయులను ఓదా ర్చారు. అప్పలసూర్య నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు ఉన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:01 AM