నీతి, నిజాయితీలకు మారుపేరు ‘గుండ’
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:08 AM
దివంగత మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ నీతి, నిజాయితీలకు నిలువు టద్దమని, ఆయన చేసిన సేవలు అజరామరమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
అరసవల్లి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ నీతి, నిజాయితీలకు నిలువు టద్దమని, ఆయన చేసిన సేవలు అజరామరమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం సంతాపసభ నిర్వహించారు. గుండ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. గుండ అప్పలసూర్యనారాయణ తనకు ఒక తండ్రిలా ఉండే వారని, ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, నగరంలో గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గుండ కుమారులు రాజకీయాల్లోకి వస్తే వారి విజయానికి పాటుపడతానని పేర్కొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ మాట్లాడుతూ.. గుండ అప్పల సూర్యనారాయణ సామాన్య జీవితం గడుపుతూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారని, ఆయన లేని లోటు పార్టీకి తీరని దన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతి, బీజేపీ నాయకు రాలు శవ్వాన ఉమామహేశ్వరి, టీడీపీ నేతలు నాయకులు కొర్ను నాగార్జున ప్రతాప్, పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్, సింతు సుఽధాకర్, బడగల వెంకటప్పారావు, దుంగ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.