Share News

కూటమి పాలనపై ప్రజలలో పెరుగుతున్న విశ్వాసం

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:09 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వవ పాలనకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన వైసీపీ చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

 కూటమి పాలనపై ప్రజలలో పెరుగుతున్న విశ్వాసం
టీడీపీలో చేరిన వారితో మంత్రి అచ్చెన్నాయుడు:

కోటబొమ్మాళి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వవ పాలనకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన వైసీపీ చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కస్తూరిపాడు గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్‌ జి. నిర్మలాగోవిందరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలే తగిన తీర్పు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీలో చేరిన నాయకులు డి.గోవిందరావు, ఎస్‌.రాజేష్‌, జి. రామకృష్ణ, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైజ్‌గ్లోబల్‌ క్యాంపస్‌ లోగోను మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే శిరీషలు ఆవిష్కరించారు.

మంత్రిని కలిసిన ఎచ్చెర్ల ఇన్‌చార్జి

ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన లంక శ్యామలరావు మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడును మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్యామలరావు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు లంక సాగర్‌, కెల్ల కిశోర్‌కుమార్‌, డోల బాలు తదితరులు మంత్రిని కలిశారు.

ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు యత్నం

పోలాకి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): సారవకోట మండలంలో ఉన్న ఏనాటికొండ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం దృష్టికి మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు తీసుకువెళ్లినట్టు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతి కార్యాలయంలో సీఎం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రి ప్రస్తావించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వీరికి ప్రభుత్వ ప్రయెజనాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఇదిలా ఉండగా ఏనాటికొండ సామాజిక వర్గం వారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 16 , 2026 | 12:09 AM