Share News

మత్స్యకారులకు ‘సమూహ బీమా’

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:13 AM

ప్రధాని మత ్య్స సంపద యోజన కింద అమలు చేస్తున్న సమూహ ప్రమాద బీమా పథకం ద్వారా మత్య్సకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సముద్రం, జలాశయాల్లో వేటపైనే ఆధారపడి జీవించే మత్య్సకారులపై పైసా భారం పడకుండా ప్రతి సభ్యుడికి చెల్లించాల్సి రూ.79.96 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తెలిపారు.

మత్స్యకారులకు ‘సమూహ బీమా’

కోటబొమ్మాళి, ఆగస్టు 6(ఆంధ్ర జ్యోతి): ప్రధాని మత ్య్స సంపద యోజన కింద అమలు చేస్తున్న సమూహ ప్రమాద బీమా పథకం ద్వారా మత్య్సకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సముద్రం, జలాశయాల్లో వేటపైనే ఆధారపడి జీవించే మత్య్సకారులపై పైసా భారం పడకుండా ప్రతి సభ్యుడికి చెల్లించాల్సి రూ.79.96 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తెలిపారు. మత్య్సకారులు, వారి కుటుం బసభ్యులు ఈ పథకం వివరాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-425-1660, ల్యాండ్‌లైన్‌ 040-24000109 లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జిఏఐఎస్‌పి ఎంఎంఎస్‌వై.సిఓఎం వైబ్‌సైట్‌ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

పథకం లక్ష్యాలు

ఫ 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల మత్య్సకారులు, చేపల రైతులు, వేటవృత్తి అనుబంధ వర్గాల వారందరికీ ఉచిత బీమా సౌకర్యం వర్తిస్తుంది. గతంలో 18 నుంచి 60 సంవత్సరాల వారికి అర్హత ఉండగా ప్రస్తుతం వీటిని 70 సంవత్సరాలు వరకు పెంచారు.ఫ వేట సమయంలో లేదా ఇతర రూపాల్లో జరిగే ప్రమాదాల బారిన పడి మరణించినా, శాశ్వత సంపూర్ణ వైకల్యం పొందినా ఈ కుటుంబానికి రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం అందుతుంది. శాశ్వత, పాక్షిక వైకల్యానికి రూ. 2.50 లక్షలు, ప్రమాదం వల్ల ఆసుపత్రి పాలైతే చికిత్స నిమిత్తం రూ. 25వేలు వరకు బీమా సాయం అందునుంది.

ఫ రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, విద్యుత్‌ షాక్‌, యంత్రాల ప్రమాదాలు, పాముకాటు, విష కీటకాల కాటు, అడవి జంతువుల దాడులు వంటి పలు రకాల అపశ్రుతులకు ఈ బీమా వర్తిస్తుంది.ఫ ప్రమాదం జరిగిన నాటి నుంచి 120 రోజుల్లో క్లెయిమ్‌ సమాచారాన్ని అందించి 180 రోజుల్లోగా దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలు సమర్పిస్తే 90 రోజుల్లోనే క్లెయిమ్‌ను పరిష్క రించి బాదితులకు ఆర్థిక సాయం అందజేయనున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:13 AM