Share News

గ్రిగ్స్‌ ఆల్‌రౌండ్‌ చాంపియన్‌ ‘నరసన్నపేట’

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:42 PM

: స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో శనివారం జరిగిన సీనియర్స్‌ బాలికల గ్రిగ్స్‌ ఫైనల్‌ పోటీల్లో ఆల్‌రౌండ్‌ చాంపియన్‌ షిప్‌ను నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల కైవసం చేసుకుంది.

గ్రిగ్స్‌ ఆల్‌రౌండ్‌ చాంపియన్‌ ‘నరసన్నపేట’
ఆల్‌రౌండ్‌ చాంపియన్‌షిప్‌ అందిస్తున్న డిప్యూటీ డీఈవో విజయకుమారి తదితరులు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో శనివారం జరిగిన సీనియర్స్‌ బాలికల గ్రిగ్స్‌ ఫైనల్‌ పోటీల్లో ఆల్‌రౌండ్‌ చాంపియన్‌ షిప్‌ను నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల కైవసం చేసుకుంది. విఽవిధ అంశాలకు సంబంధించి గేమ్స్‌తో పాటు అథ్లెటిక్స్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ను జడ్పీహెచ్‌ఎస్‌, బొడ్డపాడు, గేమ్స్‌ చాంపియన్‌షిప్‌ను జీహెచ్‌ఎస్‌, నరసన్నపేట, జడ్పీహెచ్‌ ఎస్‌ అంపోలు ఉమ్మడి పొందాయి. వ్యక్తిగత చాంపియన్‌ షిప్‌ను బొడ్డపాడుకు చెందిన ఆర్‌.ఝాన్సీ కైవశం చేసుకుంది.

విజేతలు వీరే..

కబడ్డీ పోటీల్లో జడ్పీహెచ్‌ఎస్‌, డొంకూరు విజేతగా నిలువగా సింగుపురం శారద పాఠశాల జట్టు రన్నర్‌గా నిలిచింది. ఖోఖోలో ఎంపీయూపీఎస్‌ సున్నాపల్లి (విన్న ర్‌), జడ్పీహెచ్‌ఎస్‌, ఎన్‌.టివాడ (రన్నర్‌), వాలీబాల్‌ పోటీల్లో జీహెచ్‌ఎస్‌ నరసన్నపేట (విన్నర్‌), ఎంజేపీ టెక్కలి (రన్నర్‌)గా నిలిచాయి. టెన్నికాయిట్‌లో జీహెచ్‌ ఎస్‌, పలాస విజేతగా, సింగుపురం శారద విద్యా ర్థులు రన్నర్‌గా నిలిచారు. బ్యాడ్మింటన్‌లో జడ్పీహెచ్‌ఎస్‌, అం పోలు ప్రథమ, జీహెచ్‌ఎస్‌ (నరసన్న పేట) ద్వితీయ స్థానాలు పొందాయి. బాల్‌ బాడ్మింటన్‌లో డా.బీఆర్‌ఏ గురుకులం, ఎచ్చెర్ల విజేతగా, జడ్పీహెచ్‌ఎస్‌, బాడాం రన్నర్‌గా నిలిచాయి. త్రోబాల్‌లో జడ్పీహెచ్‌ఎస్‌ ఎదుల వలస ప్రథమ, సత్యసాయి విద్యామందిర్‌, ఆర్‌.రామ కృష్ణాపురం ద్వితీయ స్థానాలు పొందాయి. హ్యాండ్‌ బాల్‌లో జడ్పీహెచ్‌ఎస్‌ వమ రవల్లి విజేతగా, జడ్పీ హెచ్‌ ఎస్‌ అంపోలు రన్నర్‌గా నిలిచాయి. విజేతలకు డిప్యూటీ డీఈవో ఆర్‌.విజయకుమారి, జిల్లా పీఈటీ, పీడీల సంఘం అధ్యక్షుడు తవిటయ్య, కార్యదర్శి ఎంవీరమణ, జిల్లా ఒలింపిక్‌ సంఘం సలహాదారు పి.సుందరరావు బహుమతులు, పతకాలు అందజేశారు.

Updated Date - Jan 31 , 2026 | 11:42 PM