Share News

ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:59 PM

దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీముఖలింగేశ్వర స్వామి తిరువీధి ఉత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి వేకువ జామున సుప్రభాత సేవతో మేల్కొలిపారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. సాయంత్రం గర్భగుడిలో గల పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను బయటకు తెచ్చి నూతన వస్త్రాలు ధరింపజేసి... పూలమాలలతో అలంకరించారు.

ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం
గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు:

జలుమూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీముఖలింగేశ్వర స్వామి తిరువీధి ఉత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి వేకువ జామున సుప్రభాత సేవతో మేల్కొలిపారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. సాయంత్రం గర్భగుడిలో గల పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను బయటకు తెచ్చి నూతన వస్త్రాలు ధరింపజేసి... పూలమాలలతో అలంకరించారు. నంది వాహనంపై ఆసీనులను చేశారు. ఆ సమయంలో ఆలయం శిఖరంపై దీపం వెలిగించి జ్వాలాతోరణం వెలిగించారు. నందివాహనంపై పార్వతీ పరమేశ్వరులను ఆసీనులను చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో నగిరికటకం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. నగిరికటకం చేరుకున్న స్వామి వారికి గ్రామస్థులు స్వాగతం పలికారు. మంగళ హారతులు అందించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని నంది వాహనంపై తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఏడుకొండలు, అర్చకుల సంఘం అధ్యక్షులు ఎస్‌.వి.చలం, అర్చకులు నారాయణమూర్తి, సింహాచలం, అచ్యుత, శివ, శ్రీకృష్ణ, అప్పారావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 11:59 PM