Share News

ఘనంగా వీర అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణ

ABN , Publish Date - May 10 , 2026 | 12:23 AM

నగర పరిధి తోటపాలెం కూడలి వద్ద ఉన్న విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యాలయ ఆవ రణలో శనివారం పదమూడున్నర అడుగుల వీర అభయాంజనేయస్వామి విగ్రహావిష్కరణ ఘనం గా నిర్వహించారు.

ఘనంగా వీర అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణ
ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీనివాసానంద సరస్వతి

శ్రీకాకుళం లీగల్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): నగర పరిధి తోటపాలెం కూడలి వద్ద ఉన్న విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యాలయ ఆవ రణలో శనివారం పదమూడున్నర అడుగుల వీర అభయాంజనేయస్వామి విగ్రహావిష్కరణ ఘనం గా నిర్వహించారు. వీహెచ్‌పీ ఉత్తరాంధ్ర సహ కార్యదర్శి ఫల్గుణరావు దంపతులతో ప్రత్యేక పూజ లు, హోమం అనంతరం ఉత్తరాంధ్ర సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరిం చారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ వీరహనుమను దర్శించు కుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయా లను పరిరక్షించాలని కోరారు. భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంద న్నారు. వీహెచ్‌పీ ఉత్తరాంరఽధ అధ్యక్షుడు వబిలి శెట్టి వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హిందూ సమా జ చైతన్యానికి ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరా జిల్లాలన్నారు. శ్రీనివాసానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్ర మంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ఎల్‌.ఆనంద రావు, ఉపాధ్య క్షులు గొద్దు భాస్కరరావు, శ్రీరంగం మధుసూ దనరావు, కార్యదర్శి చంద్రశేఖర్‌, టంకాల సూరప్పడు, భజరంగ్‌దళ్‌ ప్రాంతీయ సంయోజక్‌ రావాడ రాగశేఖర్‌, జిల్లా కన్వీనర్‌ కొయ్యాన కిరణ్‌ కుమార్‌, పీవీ శ్రీనివాస్‌, బాలాజీ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2026 | 12:23 AM