Share News

మండలి కృష్ణారావుకు ఘన నివాళి

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:27 PM

తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని అధికారులు పేర్కొన్నారు.

మండలి కృష్ణారావుకు ఘన నివాళి
మండలి కృష్ణారావు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఏఎస్పీ శ్రీనివాసరావు

శ్రీకాకుళం కలెక్టరేట్‌/ శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని అధికారులు పేర్కొన్నారు. కలెక్ట రేట్‌, జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం గాంధేయవాది మండలి వెంకట కృష్ణా రావు శత జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన సేవలను కొని యాడారు. కార్యక్రమాల్లో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఏఎస్పీ పి.శ్రీనివాస రావు, జిల్లా పర్యాటకాధికారి ఎన్‌.నారాయణరావు, సెట్‌శ్రీ సీఈవో వీవీ అప్పల నాయుడు, ఏఆర్‌ ఏఎస్పీ ఎల్‌.శేషాద్రి, ఆర్‌ఐ నరసింగరావు, సీఐ శ్రీనివాసరావు, కలెక్టరేట్‌, డీపీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:27 PM