Share News

వైభవంగా ఆదిత్యుని తెప్పోత్సవం

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:52 PM

Theppotsavam at arasavalli అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక శుద్ధ ద్వాదశి(క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా శ్రీ ఉష, ఛాయా పద్మినీ సమేతంగా ఆదిత్యుని ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు.

వైభవంగా ఆదిత్యుని తెప్పోత్సవం
ఆదిత్యుని తెప్పోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

అరసవల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక శుద్ధ ద్వాదశి(క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా శ్రీ ఉష, ఛాయా పద్మినీ సమేతంగా ఆదిత్యుని ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. పల్లకీలో ఆలయ అనివెట్టి మండపం మీదుగా.. ఇంద్రపుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. శనివారం సాయంత్రం పుష్కరిణిలో హంసనావపై 12 సార్లు స్వామిని దేవేరులతో సహా విహరింపజేశారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటం, తదితర వివిధ కళారూపాలతో వైభవంగా తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, మహదాశీర్వచనములు, తులసీ మహాలక్ష్మీ పూజ, విశేష హారతులు నిర్వహించారు. అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును బంగారు ఆభరణాలతో విశేషంగా అలంకరించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి తెప్పోత్సవాన్ని తిలకించారు. విశేషాలంకరణంలో ఉన్న ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

BJR_6300.gifBJR_6312.gif

Updated Date - Nov 21 , 2026 | 10:52 PM