Share News

ఘనంగా అరసవల్లి అసిరితల్లి శోభాయాత్ర

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:11 AM

అరసవల్లిలోని అసిరితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది.

ఘనంగా అరసవల్లి అసిరితల్లి శోభాయాత్ర
శోభాయాత్రలో యువత సందడి

అరసవల్లి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని అసిరితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. మహిషాసుర మర్దని రూపంలో అమ్మవారి ఆరడుగుల విగ్రహాన్ని కాజీపేట నీలమ్మతల్లి గుడి నుంచి పంపు హౌస్‌, వెలమవీధి, బ్రాహ్మణవీధి, ఆదిత్యా లయం మీదుగా శ్రీ శయన వీధి, కేశవరెడ్డి స్కూల్‌ వద్దకు చేరి అక్కడి నుంచి ఆదిత్యనగర్‌ కాలనీ మెయిన్‌ వీధుల గుండా యాత్ర కొనసాగింది. ఊరేగింపు చెక్క భజనలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, కాళీమాత వేషాలు, పులివేషాలు, తీన్‌ మార్‌ డప్పులతో కోలాహలంగా, అత్యంత ఉత్సాహంగా సాగింది. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగ ళవారం సిరిమానోత్సవం జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Apr 27 , 2026 | 12:11 AM