అంగరంగా వైభవంగా కొత్తమ్మతల్లి ఉత్సవాలు
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:33 AM
కొత్తమ్మతల్లి ఉత్సవాలను అక్టోబర్ 13, 14, 15 తేదీలలో అందరి సహాయ సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు
కోటబొమ్మాళి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కొత్తమ్మతల్లి ఉత్సవాలను అక్టోబర్ 13, 14, 15 తేదీలలో అందరి సహాయ సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం స్థానిక కొత్తమ్మతల్లి ప్రాంగణంలో గ్రామపెద్దలతో ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అవసరమైన చోట డ్రోన్ కెమెరాలు, వీఐపీ గేట్లు, సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్‌లో నీళ్ళు, పాలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. మూడో రోజు జంగిడి వచ్చే సమయానికి ఎటువంటి ఘర్షణలు లేకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది వలంటీర్లను నియమించుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధం్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, ఆర్‌డీవో ఎన్.కృష్ణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, మండల పార్టీ అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్, కొత్తమ్మతల్లి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోరాడ గోవిందరావు, నాయకులు బోయిన రమేష్, కల్లి నాగయ్యరెడ్డి, పూజారి శైలజ, కర్రి అప్పారావు, తహసీల్దార్ చింతలపూడి ప్రసాదరావు, ఎంపీడీవో కిల్లారి నారాయణరావు తదితరులు పా ల్గొన్నారు.
2029 నాటికి సొంత ఇళ్లు
2029 నాటికి అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు మం త్రి కింజరాపు అ చ్చెన్నాయుడు తెలి పారు. ఎరక య్యపేట, దం త గ్రామాలకు చెందిన 50 మందికి ఇళ్ల పట్టాలు అంద జేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతుల భూములను వైసీపీ నాయకుల బలవంతంగా కొనుగోలు చేయాలని చూశారని, రైతులు ఆ భూములు ఇవ్వకపోవడంతో 21ఎలోకి మార్చారని మంత్రి తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు వాటిని సరిచేసి.. వారి పేర్లతో వన్‌బీని తయారు చేసి అందజేస్తున్నామన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించండి
వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో టెక్కలి సహాయ బీసీ సంక్షేమాధికారి, వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో టెక్కలి డివిజన్ పరిధిలోని 12 బీసీ వసతిగృహాల్లో 356 మంది విద్యార్థులు నూతనంగా ప్రవేశాలు పొందారని మంత్రికి అధికారులు వివ రించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు.