Share News

వైభవంగా ఉమాజఠలేశ్వరస్వామి కల్యాణం

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:14 AM

పాతశ్రీకాకుళం నక్కవీధిలో వేంచేసి ఉన్న ఉమా జఠలేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళ వారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ఉమాజఠలేశ్వరస్వామి కల్యాణం
ఉమా జఠలేశ్వరునికి అభిషేకం చేసేందుకు కలశాలతో వచ్చిన మహిళలు

108 కలశాలతో జలాభిషేకం

శ్రీకాకుళం కల్చరల్‌, జూలై7,(ఆంధ్రజ్యోతి): పాతశ్రీకాకుళం నక్కవీధిలో వేంచేసి ఉన్న ఉమా జఠలేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళ వారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి 108 కలశాలతో సుగంధద్రవ్యాలతో ఆలయప్రధాన అర్చకులు బి.అశ్వనీ కుమార్‌, మహేష్‌ ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. మహిళలకు కలశాలతో నీటిని తీసుకువచ్చి అభిషేకం చేశారు. సాయంత్రం ఉమా జఠలే శ్వరునికి ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి సందర్భంగా క్షీరాభిషేకం, కుంకుమార్చ నలు, ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. పలువురు భక్తులు పాల్గొని స్వామి కల్యాణం తిలకించారు.

Updated Date - Jul 08 , 2026 | 12:14 AM