వైభవంగా ఆదిత్యుని కల్యాణం
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:31 AM
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారికి ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా గురువారం వైభవంగా కల్యాణం నిర్వహించారు.
అరసవల్లి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామివారికి ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా గురువారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఆశ్వయుజ బహుళ ఏకాదశి పురస్కరించుకుని ఆదిత్యుని ఆలయ అనివెట్టి మండపంలో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేద పండితులు, అర్చకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇప్పిలి ఫణీంద్రశర్మ, రాజా శర్మ, మాధవరావు శర్మ, ఇప్పిలి సాందీపశర్మ, దర్భముళ్లశ్రీనివాసశర్మ, వికాస్ శర్మ, పార్థసారథి శర్మ పాల్గొన్నారు.