Share News

వైభవంగా ఆదిత్యుని కల్యాణం

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:44 PM

ప్రత్యక్ష దైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారా యణ స్వామి వారి కల్యాణం శుక్రవారం వైభ వంగా నిర్వహించారు.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం
ఆదిత్యుని కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

అరసవల్లి, జూలై 10(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష దైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారా యణ స్వామి వారి కల్యాణం శుక్రవారం వైభ వంగా నిర్వహించారు. నిజ జ్యేష్ట బహుళ ఏకా దశిని పురస్కరించుకుని ఆలయ అనివెట్టి మండ పంలో ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వ ర్యంలో ఉషా, పద్మిని, ఛాయా సమేత సూర్య నారాయణ స్వామికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం కమనీయంగా సాగింది. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి సందీపశర్మ, వేద పండితులు దర్భముళ్ల శ్రీనివాసశర్మ, వికాస్‌శర్మ, పార్థసారథి శర్మ, సాంబమూర్తి, భక్తు లు పాల్గొన్నారు.

దాతల విరాళం..

సూర్యనారాయణ స్వామి ఆలయంలో శాశ్వత అన్నదానానికి బరంపురానికి చెందిన గంటసాల స్వర్ణ తిరుమల, సాయి అక్షిత్‌ బంధువులు రూ. లక్ష విరాళాన్ని అందించారు. అలాగే శ్రీకాకుళం నగరానికి చెందిన గెంబలి నాగేశ్వరరావు కింతలి సావిత్రమ్మ జ్ఞాపకార్థం రూ.1,00,116 విరాళం అందించారు. దాతల పేరున ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. స్వామివారి చిత్రపటాన్ని ప్రధాన అర్చకుడు శంకరశర్మ, జూనియర్‌ అసి స్టెంట్‌ బాల భాస్కరశర్మ అందించారు.

Updated Date - Jul 10 , 2026 | 11:44 PM